Share News

కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:52 PM

కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కంభం రోడ్డులోని అటవీశాఖ ఎకో పార్కులో మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్ది

కనిగిరి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కంభం రోడ్డులోని అటవీశాఖ ఎకో పార్కులో మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నిక లకు ముందు ఇచ్చిన సూపర్‌ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి అమలు చేస్తున్నట్టు చెప్పారు. కనిగిరిలో ఇంటింటికి కుళాయి నీటిని సరఫరా చేసేందుకు వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కనిగిరి ప్రాంతానికి చెందిన ట్రిపుల్‌ఐటీ తిరిగి కనిగిరికి తెప్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతు న్నాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో అభివృద్ది మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటుతో నాలుగు నియోజ కవర్గాలైన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో వేగవంతంగా ఆర్థిక వనరులు ఒనగూరే అవకాశాలు మెండుగా ఏర్పడనున్నాయన్నారు. వచ్చే నూతన ఆంగ్ల సంవత్సరం కనిగిరి ప్రాంత ప్రజలకు అన్ని విధాల మేలు చేకూర్చాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, టీడీపీ నాయకులు కొండా కృష్ణారెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), చీకటి వెంకటసుబ్బయ్య, కేవిఎస్‌గౌడ్‌, కొబ్బరిబొండాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:52 PM