సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:14 PM
పీసీపల్లి మండలం పెదయిర్లపాడు రెవెన్యూ పరిధిలోని లింగన్నపాలెంలో నిర్మితమైన ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఈనెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
11న పీసీపల్లి మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ప్రారంభం
అధికారులకు పలుసూచనలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పీసీపల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పీసీపల్లి మండలం పెదయిర్లపాడు రెవెన్యూ పరిధిలోని లింగన్నపాలెంలో నిర్మితమైన ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఈనెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు, జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డికి సమాచారం అందింది.
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో డాక్టర్ ఉగ్ర శనివారం అధికారులతో కలిసి ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏచిన్న సమస్య తలెత్తకుండా చకచకా ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఈపార్క్‌తో వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే ఉగ్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్, మండలపార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య, పులి ప్రతాప్‌రెడ్డి, బొల్లా నరసింహారావు, పువ్వాడి వెంకటేశ్వర్లు, మూలె మహేంద్రరెడ్డి, వీరయ్య, క్రిష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.