ఉద్యోగులపై సీఎం సానుకూల స్పందన హర్షణీయం
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:31 PM
ఉద్యోగుల పట్ల సీ ఎం చంద్రబాబునాయుడు సా నుకూల స్పందన హర్షించద గి న విషయమని ఏపీఎన్జీవో సం ఘం, ఏపీజేఏసీ నాయకులు పీవీ రమణా రెడ్డి, హజరత్‌ఆలీ అన్నారు. ఆదివారం స్థా నిక ఎన్జీవో సంఘ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్జీవో నేతల వెల్లడి
కనిగిరి, అక్టోబరు 19 (ఆం ధ్రజ్యోతి): ఉద్యోగుల పట్ల సీ ఎం చంద్రబాబునాయుడు సా నుకూల స్పందన హర్షించద గి న విషయమని ఏపీఎన్జీవో సం ఘం, ఏపీజేఏసీ నాయకులు పీవీ రమణా రెడ్డి, హజరత్‌ఆలీ అన్నారు. ఆదివారం స్థా నిక ఎన్జీవో సంఘ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దీపావళి కా నుకగా నవంబర్ నుంచి ఒక డీఏను విడుదల చేయటం, 60రోజుల్లో ఉద్యోగుల హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటుచేసి ఇన్సూ రెన్స్ విధానాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయటం కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని తెలియ జేస్తుందన్నారు.ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు, చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
డీఏ ప్రకటనపై యూటీఎఫ్ హర్షం
సీఎస్‌పురం(పామూరు), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఒక డీఏ ప్రకటించడం పట్ల యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్.వెంకట్రామయ్య, షేక్ పాదుషా, జిల్లా కార్యదర్శి వి.సాంబ శివరావు హర్షం వ్యక్తం చేశారు. చైల్డ్‌లీవ్ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చునని ప్రకటించడంపట్ల మహిళా ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుం దన్నారు.