పేదలకు ఆపన్న హస్తం సీఎం సహాయనిధి
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:11 PM
అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో అనాఆరోగ్యంతో బాధపడుతున్న 53 మందికి రూ.40,16,410 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
53 మందికి రూ.40.16లక్షలు పంపిణీ
గిద్దలూరు టౌన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో అనాఆరోగ్యంతో బాధపడుతున్న 53 మందికి రూ.40,16,410 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భభంగా అశోక్‌రెడ్డి మాట్లాడు తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో పేదవారు నాణ్యమైన వైద్యం పొం దవచ్చని, వారికైన ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పొందవచ్చన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమ స్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 763 మందికి ముఖ్యమంత్రి స హాయనిధి ద్వారా రూ.6.68.48,000 అందచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు.
29మందికి రూ.18,65,699 లక్షల చెక్కుల పంపిణీ
ఎర్రగొండపాలెం : ఆపన్నులకు సిఎం సహాయనిధి చెక్కులు వరం అని, ధరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సహాయనిధి సాయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో శనివారం ఆపన్నులకు 29మందికి, రూ.18,65,699 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ఆశయమని అన్నా రు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చే కూరి సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, మేకల వళరాజు, టీడీపీ నాయకులు వేగినాటి శ్రీను, కంచర్ల. సత్యనారాయణగౌడ్, మంత్రునాయక్, పయ్యావుల ప్రసాద్, తోట మహే ష్ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు ఆపన్నులు పాల్గొన్నారు.