సీఎం సహాయనిధి పేదలకు భరోసా
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:04 AM
పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో శనివారం సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 46 మందికి రూ.67.65లక్షల చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్‌ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో శనివారం సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 46 మందికి రూ.67.65లక్షల చెక్కులను అందజేశారు.
అలాగే, అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి శనివారం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొని కంటి పరిక్షలు చేయించుకున్నారు. వృద్ధులను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రద్ధ, డాక్టర్ శివాని కంటి పరీక్షలు చేశారు. ఈ శిబిరంలో 305 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 130 మందికి ఆపరేషన్‌లు అవసరమని నిర్ధారించారు. వీరిని ఈనెల 20న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాల్లో శంకర కంటి ఆసుపత్రి తరలించనున్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు కరణం అరుణ, దొరసాని, మాజీ కౌన్సిలర్, ఏఎంసీ డైరెక్టర్ షేక్ వాజిదాబేగం, ధనలక్ష్మి, పార్వతమ్మ, నారాయణమ్మ, నాయకులు జంషీర్, నజిముద్దీన్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.