Share News

సీఎం సహాయనిధి పేదలకు వరం

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:56 PM

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.

    సీఎం సహాయనిధి పేదలకు వరం
ఎర్రగొండపాలెం టీడీపీ ఆఫీసులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు

33 మందికి రూ. 32,58,671 లక్షలు చెక్కులు పంపిణీ

ఎర్రగొండపాలెం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. 33 మంది ఆపన్నులకు రూ. 32,58,671 లక్షల సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో టీడీపీ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు వేగినాటి శ్రీను, తెలుగుయువత అధ్యక్షుడు దొడ్డా శేషాధ్రి, మండలపార్టీ అధ్యక్షుడు పి. ప్రసాదు, మేకల వళరాజు, టీడీపీ నాయకులు మేడికొండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 09:57 PM