సీఎం సహాయనిధి పేదలకు వరం
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:37 PM
సీఎం సహాయనిధి పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి ప్రాంగణంలో మంగళవారం 62 మంది లబ్ధిదారులకు రూ.41.32లక్షల చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి ప్రాంగణంలో మంగళవారం 62 మంది లబ్ధిదారులకు రూ.41.32లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదకుటుంబాలకు చెందినవారు అనారోగ్యం పాలైతే ఎంత ఇబ్బందులు పడతారో తనకు తెలుసునన్నారు. ఇలాంటావారు కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు. అందుకోసం ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కాంక్షించి వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వీలు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి కనిగిరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా వైద్యఖర్చులను అందజేసినట్టు చెప్పారు. ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గమనించాలన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వైద్య చికిత్స పొందినవారు వైద్యుల సలహాలను పాటించి అనారోగ్యం నుంచి బయటపడి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. లబ్ధిదారుల కుటుంబాలకు దసరా శుభాకాంక్షలను తెలిపారు. కార్య క్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, మండల కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, హెచ్‌ఎంపాడు మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.