46 మందికి సీఎం రిలీ్‌ఫఫండ్ చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:21 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపన్నహస్తం అందిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞత కల్గిఉండాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 46 మందికి మంజూరైన రూ.26.05,928 శనివారం వారి కుటుంబ సభ్యులకు స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పంపిణీ చేశారు.
ఎర్రగొండపాలెం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపన్నహస్తం అందిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞత కల్గిఉండాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 46 మందికి మంజూరైన రూ.26.05,928 శనివారం వారి కుటుంబ సభ్యులకు స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా పేదలు ఎవరైనా చికిత్స కోసం సీఎం సహాయనిధి కోరితే వెంటనే నేనున్నానని నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనీయుడన్నారు. అలాగే టీడీపీలో క్రియాశీలక కార్యకర్తలు పెద్దారవీడు మండలం బోడిరెడ్డిగ్రామం గంజినారాయణమ్మకు ప్రమాదబీమా రూ. 5లక్షలు, సానికవరం గ్రామానికి చెందిన ఇడగొట్ల కల్యాణ్‌బాబుకు రూ. 5లక్షలు ప్రమాద బీమా చెక్కులు వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ ముఖ్యనాయకులు కాకర్ల కోటయ్య, చిట్యాల వెంగళరెడ్డి, సత్యనారాయణగౌడ్, వేగినాటి శ్రీను, దొడ్డా శేషాద్రి, సుబ్బారెడ్డి, షేక్ మస్తాన్ వలి, చేదూరి గంగయ్య, పోట్ల గోవింద్, రాములు పాల్గొన్నారు.