డీఎస్సీపై మాట నిలబెట్టుకున్న సీఎం
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:33 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో డీఎస్సీ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు.
కొత్త ఉపాధ్యాయుల సన్మానంలో ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో డీఎస్సీ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు. ఎర్రగొండపాలెం ని యోజకవర్గంలో 94 మంది ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. కొత్తగా వస్తున్న ఉపాధ్యాయులు ప్రతిభతో పాఠశాలలకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ చేకూరిసుబ్బారావు, ఎంఈవో ఆంజనేయులు, నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, వేగినాటి శ్రీను పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
36 మందికి వైద్య ఖర్చుల కోసం రూ.26,39,242లక్షలు సీఎం సహాయ నిధి చెక్కులను ఎరిక్షన్‌బాబు అందజేశారు. త్రిపురాంతకం, పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు మేకల వళరాజు, పోట్ల గోవింద్ పాల్గొన్నారు.