ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:21 PM
విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని టీడీపీ నేతలు కొనియాడారు. పట్టణంతోపాటు గ్రామాలలో ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.
అద్దంకి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని టీడీపీ నేతలు కొనియాడారు. పట్టణంతోపాటు గ్రామాలలో ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక కార్యాలయంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేశారు. రాజీవ్‌కాలనీలో కేక్‌ను మం త్రి గొట్టిపాటి హర్షవర్ధన్ కేక్ కట్ చేశారు. మెయిన్ రోడ్డులో గొట్టిపాటి సైన్యం ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయం సమీపం లో, 18, 19 వార్డులతో పాటు పలు చోట్ల కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమాల్లో పట్టణాధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, కౌన్సిలర్‌లు కంపా రజనీ, తిరుపతమ్మ, విజయలక్ష్మి, కాకాని అశోక్, రామారావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కరి పరమేష్, రమేష్, శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, లహరి, కోనేటి అనిల్, నరేంద్ర, స్టాలిన్, మురళీసుధాకర్, రామాంజనేయులు, కొండలు, అనిల్ పాల్గొన్నారు. ధేనువకొండ పునరావాసకాలనీ బలరామకృష్ణపురంలో నాగినేని రామకృష్ణ యూ త్ ఫోర్స్ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుక ఘనంగా నిర్వహించారు.
పంగులూరు : సంక్షేమం, అభివృద్ధే ల క్ష్యంగా రాష్ర్టాన్ని ప్రగతపధంలో ముం దుకు నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నేత అని టీడీపీ నాయకులు కొనియాడారు. ఆదివారం చంద్రబాబు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. బీసీ బాలికల వసతి గృహంలో కేక్ కట్ చేసి, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్, కేవీ సుబ్బారావు, రామసుబ్బారావు, ఏడుకొండలు, సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత బాబు
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ర్టాభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికుడు సీఎం చంద్రబాబు అని, మెగా డీఎస్సీ ప్రకటనతో వేల ఉద్యోగాల కల్పనతో శ్రామికుడయ్యారని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. క్యాంపు కార్యాలయంలో కేక్ చేశా రు. ఏరియా హాస్పిటల్ వద్ద గర్భిణులు, రోగులకు పండ్లు, బ్రెడ్‌లను ఎమ్మెల్యే అందజేశారు. రక్తదానాన్ని అందజేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నేటికీ నవయువకుడిలా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు బాబు అని కొనియాడారు. ముందుగా బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
పర్చూరు : సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటాల వద్ద కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. బొమ్మ ల సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షులు మక్కెన శేఖర్‌బాబు నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కారుమంచి కృష్ణ, సురేష్, చింపయ్య, శ్రీనివాసరావు, దుర్గా, గౌస్ బాషా పాల్గొన్నారు. నాగులపాలెంలో వేడుకలు నిర్వహించారు.
కారంచేడులో : కారంచేడు మండలం లో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ క ట్ చేసి, మిటాయిలు, పండ్లు పంపిణీ చే శారు. కార్యక్రమంలో రామయ్య, డీవీఎల్, దగ్గుబాటి చౌదరి పాల్గొన్నారు.
ఇంకొల్లు : చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి పాలేరు రామకృష్ణ, మార్క్, సంధ్యారాణి, అనంతలక్ష్మి, జనసేన పార్టీ ఇన్‌చార్జి విజయకుమార్, నాయకులు పాల్గొన్నారు.
మార్టూరు : ముఖ్య మంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆదివారం మండలంలో పార్టీ శ్రేణులు ఘనంగా ని ర్వహించారు. ఎమ్మెల్యే ఏ లూరి క్యాంపు కార్యాలయం, మార్టూరు లోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అమ్మ ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
చినగంజాం : సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యాలయ ఆవరణలో మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య కేకు కట్ చేశారు. పెదగంజాం గ్రామ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆసోది సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ నక్కల కృప్ణ కేకు కట్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు రాయని ఆత్మారావు, రాఘవయ్య, అబ్దుల్‌కలాంఅజాద్, లక్ష్మి, నీలాయపాలెం సర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.