సీఎం చంద్రబాబుకు అవార్డ్ గర్వకారణం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:43 PM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను ప్రకటించడం రాష్ట్రానికే గర్వకారణమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు 10.7 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెచ్చి రికార్డు సృష్టించారని చంద్రబాబును కొనియాడారు. పాలనలో వేగం, పారదర్శకత, టెక్నాలజీని జోడించిన ఒరిజినల్ సీఈవో చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని ఉద్యోగాల కల్పనకు నిలయంగా మార్చారని పేర్కొన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణానికి, అభివృద్ధికి దక్కిన గుర్తింపు అని, తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి దక్కిన గౌరవంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.