Share News

పరిశుభ్రత, పచ్చదనం అందరి బాధ్యత

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:09 PM

పరిశుభ్రత, పచ్చదనం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రాచర్ల రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కా ర్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.

పరిశుభ్రత, పచ్చదనం అందరి బాధ్యత
చెత్తను తొలగిస్తున్న ఎమ్మెల్యే కందుల, నాయకులు

స్వచ్ఛాంధ్రలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత, పచ్చదనం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రాచర్ల రోడ్డులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కా ర్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. పట్టణ పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్‌ ఈవీ రమణబాబు, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : ఎమ్మెల్యే కందుల

తర్లుపాడు : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని మంగలకుంటలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కందుల ముందుగా గ్రామస్థుల చేత చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధిలో చెత్తను ఉడ్చి తొలగించారు. కార్యక్రమంలో ఈవోఆర్ఢీ రాఘవరావు, పంచాయతీ కార్యదర్శి కాలంగి శ్రీనివాసులు, వ్యవసాయ అధికారిని జోష్నదేవి, టీడీపీ నాయకులు ఉడుముల చిన్నపరెడ్డి, ఈర్ల వెంకటయ్య, గోపినాథ్‌ చౌదరి, కాశయ్య, వెంన్న వెంకటరెడ్డి, అచ్చిరెడ్డి, కుందూరు కాశిరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎంపీడీవో ఏ బాలచెన్నయ్య పేర్కొన్నారు. మండలంలోని బోడపాడు గ్రామంలో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో బాలచెన్నయ్య సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులు, విద్యార్థులతో కలసి పాల్గొన్నారు. ముందుగా సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలను పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. మంచి ట్యాంకు వద్ద, కాలువ వద్ద మురుగు నీటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జాకబ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రవికుమార్‌, పంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మీ, గ్రామ టీడీపీ నాయకులు రామిరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, కనకా శ్రీనివాసులు, చైతన్యరెడ్డి, గ్రామస్థులు సత్యనారాయణరెడ్డి, సచివాలయ ఉద్యోగులు, క్లాప్‌ మిత్రలు, మహిళలు పాల్గొన్నారు.

కల్వర్టర్ల నిర్మాణానికి భూమిపూజ

దోర్నాల : ఏబీఎం కాలనీలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో మురికి కాలువలపై రూ.20లక్షల నిధులతో చేపట్టిన 18కల్వర్టర్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసూనదేవి, సర్పంచి చిత్తూరి హారిక, సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు, సీడీపీవో లక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ మాబు, నాయకులు దొడ్డా శేషాద్రి, మల్లయ్య, చంటి, దేసు నాగేంద్రబాబు, బట్టు విద్యా సంస్థల చైర్మన్‌ బట్టు రమణారెడ్డి, రావెళ్ల సత్యనారాయణ, రాఘవ, ఎలకపాటి చంచయ్య, బాబు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

రాచర్ల : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటించాలని అనుమలవీడు బీసీ బాలుర వసతిగృహ హెచ్‌డబ్ల్యూవో ఎస్‌ మురళి అన్నారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానిక వసతి గృహంలో ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యా ర్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

కొనకనమిట్ల : ప్రతి ఒక్కరు పరసరాల పరిశుభ్రతను అలవర్చు కోవాల్సిన భాద్యత మనందరిపై ఉందని ఎంపీడీవో ఈశ్వరమ్మ అన్నారు. మండల కార్యాలయం ఆవరణలోని పరిసరాలను శనివారం స్వచ్చాఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో ఈశ్వరమ్మ, తహసీల్దార్‌ ఆవుల సురేష్‌, పలువురు అధికారులు సిబ్బంది కలిసి పారిశుధ్య కార్యక్రమాలు చేయించారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని ఏటీడబ్ల్యూవో వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని హనుమంతుని గూడం, తిరుమల గిరి కాలనీలలో ఆశ్రమ పాఠశాలలో ముస్తాము కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తాటి నాగేశ్వరరావు, శీలం శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 11:09 PM