Share News

స్వచ్ఛ మార్కాపురం అందరి లక్ష్యం

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:20 PM

స్వచ్ఛ మార్కాపురం అందరి లక్ష్యం కావాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక వైపాలెం రోడ్డులోని డంపింగ్‌ యార్డులో సోమవారం సంవత్సరాలుగా పోగుబడిఉన్న వ్యర్థాలను ప్రాసెస్‌ చేసే స్ర్కీనింగ్‌ మిషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

స్వచ్ఛ మార్కాపురం అందరి లక్ష్యం
స్ర్కీనింగ్‌ మిషన్‌ వద్ద ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ మార్కాపురం అందరి లక్ష్యం కావాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక వైపాలెం రోడ్డులోని డంపింగ్‌ యార్డులో సోమవారం సంవత్సరాలుగా పోగుబడిఉన్న వ్యర్థాలను ప్రాసెస్‌ చేసే స్ర్కీనింగ్‌ మిషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా స్థానిక డంపింగ్‌ యార్డులో ఉన్న 33 వేల మె ట్రిక్‌ టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో యంత్రం ద్వారా ప్రాసెస్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ పనిని రూ.2.97కో ట్లతో చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా భవిష్యత్తులో డంపింగ్‌ యార్డులో ఎలాం టి చెత్త, వ్యర్థాలు ఉండవన్నారు. చెత్త, వ్యర్థాల్లోని వివిధ పదార్థాలను వేరుచేసి బయటకు తరలించడం జరుగుతుందన్నారు. సారవంతమైన మట్టిని రైతులు పొలాల్లో తోలుకునేందుకు ఉపయోగించుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లిఖార్జున్‌, మాలపాటి వెంకటరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, జవ్వాజి రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు నాలి కొండయ్య, షేక్‌ చిన్నషెక్షావలి, దారివేముల హర్షితబాబి, దొడ్డ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:20 PM