Share News

నగర కమిషనర్‌కు ఆర్డీగా ఉద్యోగోన్నతి

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:20 AM

ఒంగోలు నగర కమిషనర్‌ కోడూరి వెంకటేశ్వరరావుకు రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఆర్‌డీఎంఏ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీచేసింది.

నగర కమిషనర్‌కు ఆర్డీగా ఉద్యోగోన్నతి
కమిషనర్‌ వెంకటేశ్వరరావును అభినందిస్తున్న టీడీపీ నాయకులు

పలువురి అభినందనలు

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర కమిషనర్‌ కోడూరి వెంకటేశ్వరరావుకు రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఆర్‌డీఎంఏ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీచేసింది. నగర కమిషనర్‌గా ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఒంగోలులో విధులు నిర్వహిస్తుండగానే స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌గా పదోన్నతి లభిం చగా, రెండు నెలల్లోనే ఆర్‌డీఎంఏగా ప్రమోషన్‌ దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ఈ-వేస్ట్‌ కలెక్షన్‌లో రాష్ట్రంలోనే ప్రఽథమ స్థానంలో ఒంగోలు కార్పొరేషన్‌ నిలవడంతో వెంకటేశ్వరరావు ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌లో ముప్పు వాటిల్ల కుండా తీసుకున్న ముందస్తు చర్యలతో ప్రభుత్వం సంతృప్తి చెందింది. రెండుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెంకటేశ్వ రరావు అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయన ఆర్‌డీఎంఏగా ఉద్యోగోన్నతి పొందినప్పటికీ ఆ హోదాలోనే ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా కొనసాగనున్నారు. మంగళవారం కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, తిప్పరమల్లి రవితేజ, అంబూరి శ్రీనివాసరావు, సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌, టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావులు కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 01:20 AM