Share News

పీ4 సర్వేలో పట్టణాలు ఫర్వాలేదు!

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:43 AM

పేదరికం లేని సమా జమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటుభాగస్వామ్యంతో చేపట్టిన పీ4 సర్వేలో పట్టణాలు ఫర్వాలేదు అనిపించాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టిన ఈ సర్వే జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది.

పీ4 సర్వేలో పట్టణాలు ఫర్వాలేదు!
ఒంగోలులోని గద్దలగుంటలో పీ4 సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బంది

ప్రథమ స్థానంలో ఒంగోలు, రెండో స్థానంలో కనిగిరి

ఆఖరి స్థానంలో పొదిలి మునిసిపాలిటీ

పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : పేదరికం లేని సమా జమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటుభాగస్వామ్యంతో చేపట్టిన పీ4 సర్వేలో పట్టణాలు ఫర్వాలేదు అనిపించాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టిన ఈ సర్వే జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. పట్టణాల వరకూ చూస్తే జిల్లాకేంద్రమైన ఒంగోలు కార్పొరేషన్‌ ప్రథమ స్థానంలో, కనిగిరి రెండో స్థానంలో ఉంది. కాగా పొదిలి మునిసిపాలిటీ 50 శాతం కూడా పూర్తిచేయకపో వడంతో ఆఖరి స్థానంలో నిలిచింది.

పీ4 సర్వే అంటే?

స్వర్ణాంధ్రలో భాగంగా ప్రజాప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా పేదరికంలో దిగు వన ఉన్న 20 శాతంకుటుంబాలను గుర్తించి వారి ఆర్థిక ప్రమాణాలను పెంచాలని నిర్దేశించుకుంది. అందులో భాగంగా పీ4 సర్వే చేయిస్తోంది. పేదరికంలో దిగువ ఉన్న వారి స్థితిగతులు తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు కొందరిని మార్గదర్శకులుగా నియమించి ఆర్థిక అసమానతలు తొలగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రానున్న ఐదేళ్లలో పేదరికం లేని సమాజ స్థాపన చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

పీ4సర్వేలో గుర్తించిన గృహాలు

కార్పొరేషన్‌/మునిసిపాలిటీ పీ4 సర్వేలో గుర్తించినవి సర్వే శాతం

ఒంగోలు 9,537 99.45ు

చీమకుర్తి 1,527 85.16ు

దర్శి 1,398 90.37ు

గిద్దలూరు 715 49.97ు

కనిగిరి 2,445 99.15ు

మార్కాపురం 2,857 90.84ు

పొదిలి 1,284 49.96ు

Updated Date - Aug 10 , 2025 | 01:43 AM