సీఐఐ సదస్సు సూపర్ హిట్
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:31 AM
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకువచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో 614 ఎంవోయూలు చేసుకున్నాయని వెల్లడించారు.
ఎంవోయూలతో రాష్ట్రానికి రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు..16 లక్షల ఉద్యోగాలు
జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు, 5 వేలకుపైగా కొలువులు వచ్చే అవకాశం
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి
తూర్పునాయుడుపాలెం (కొండపి), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకువచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో 614 ఎంవోయూలు చేసుకున్నాయని వెల్లడించారు. దీని ద్వారా 16లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాల యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ సదస్సు వల్ల జిల్లాకు 3,704 కోట్ల పెట్టుబడులు, 5వేలకుపైగా ఉద్యోగాలు వస్తాయని స్వామి వివరించారు. వెనుకబడిన మన జిల్లాకు ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడులు రావడం ఇదేమొదటిసారని ఆయన అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడికి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నదే చంద్రబాబు సంకల్పమన్నారు.