సీఐ సమీముల్లాపై వేటు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:15 PM
డీటీసీలో సీఐగా పనిచేస్తున్న సమీముల్లాను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు.
ఒంగోలు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : డీటీసీలో సీఐగా పనిచేస్తున్న సమీముల్లాను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. సమీముల్లా గత వైసీపీ పాలనలో మాచర్లలో పనిచేసిన సమయంలో ఆయన పలు కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ సీఐ సమీముల్లా అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించడంతో ఆయన సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.