క్రిస్మ్‌సకు ముస్తాబైన చర్చీలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:05 PM
క్రిస్మస్ వేడుకల నిమిత్తం మండలంలోని అన్నీ చర్చీలు సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డాయి. బుధవారం అర్ధరాత్రి నుండి మిడ్‌నైట్ ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. అందుకోసం దొనకొండలోని ప్రధానమైన ఆర్సీఎం, ఏబీఎం, సీయ్‌సఐ, లూథరన్‌తో పాటు అన్నీ చర్చీల్లో ప్రత్యేక ఆకర్షణీయమైన విద్యుత్ లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ చెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
దొనకొండ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ వేడుకల నిమిత్తం మండలంలోని అన్నీ చర్చీలు సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డాయి. బుధవారం అర్ధరాత్రి నుండి మిడ్‌నైట్ ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. అందుకోసం దొనకొండలోని ప్రధానమైన ఆర్సీఎం, ఏబీఎం, సీయ్‌సఐ, లూథరన్‌తో పాటు అన్నీ చర్చీల్లో ప్రత్యేక ఆకర్షణీయమైన విద్యుత్ లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ చెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దొనకొండ ఆర్సీఎం చర్చీలో సంఘకాపరి రెవరండ్ ఫాదర్ ధామస్ పర్యవేక్షణలో యువకులు యేసుక్రీస్తు పుట్టుకను సూచించే పశువుల పాకను ఎంతో అందంగా తయారు చేశారు బంధుమిత్రుల రాకలతో సందడి వాతావరణం నెలకొంది.
పామూరులో..
పామూరు : క్రిస్మ్‌సపండు గ వేడుకల్లో భాగంగా పామూరు. సీఎ్‌సపురం మండలాల్లోని ప్రార్థనా మందిరాలు విద్యుత్‌దీపాలతో కాంతులీనుతున్నాయి. పట్టణంలోని తెలు గు బాస్టిస్టు చర్జ్ వద్ద క్రీస్తుజననాన్ని స్వాగతిస్తూ చర్చ్‌వద్ద స్టార్స్‌ను ఏర్పాటు చేశారు.
కురిచేడులో..
కురిచేడు : క్రిస్మస్ పండుగ సందర్భంగా మండలంలోని చర్చిలను అం దంగా అలంకరించారు. కురిచేడులోని లూధరన్ చర్చికి నూతన రంగులు వేసి విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌సీఎం, తెలుగు బాప్టిస్టు చర్చిల ఫాదర్లు తెలిపారు.
దుస్తుల పంపిణీ
కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమా లు ప్రారంభోత్సవానికి వచ్చి న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మిలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు.