Share News

గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 11:50 PM

వేసవిలో ఎండల నుంచి ఉపశమనంతోపాటు ప్రజల దాహార్తి తీర్చేలా గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి
చలివేంద్రంలో మజ్జిగను పంపిణీ చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, మే 17 (ఆంఽధ్రజ్యోతి) : వేసవిలో ఎండల నుంచి ఉపశమనంతోపాటు ప్రజల దాహార్తి తీర్చేలా గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలను దృష్టిలో పెట్టుకొని నాయకులు, అధికారులు సమన్వయంతో పట్టణం, పల్లె తేడా లేకుండా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి చ లి వేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అనంతరం మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వరలక్ష్మి, సర్పం చి చిత్తూరి హారిక, ఎంపీడీవో నాసర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివ కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు షేక్‌ మాబు, బట్టు సుధాకర్‌ రెడ్డి, దొడ్డా శేష్రా ద్రి, షేక్‌ మంజూర్‌బాషా, సుబ్బారెడ్డి, షేక్‌ ఇస్మాయిల్‌, బాషా పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:50 PM