బాలబాలికలు పాఠశాలల్లోనే ఉండాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:13 PM
బాలురు, బాలికలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యను అభ్యసిస్తూ ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీంషరీఫ్ చెప్పారు.
జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి ఇబ్రహీంషరీఫ్
ఒంగోలు రూరల్, సెప్టెంబరు 9 (ఆంఽధ్రజ్యోతి) : బాలురు, బాలికలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యను అభ్యసిస్తూ ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీంషరీఫ్ చెప్పారు. ఒంగోలు నగరం జిల్లా న్యాయాధికార సంస్థ కార్యాలయ ప్రాగణంలో మంగళవారం లీగల్ సర్వీసెస్ టూ చిల్ట్రన్స్ అనే అంశంపై జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాల నిర్మూలనకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి బాలిక ఉన్నతంగా చదువుకోవటానికి అధికారులు తమవంతు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా వైద్యసదుపాయాలు బాలబాలికలకు అందేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీనాయక్, కార్మిక శాఖ అధికారులు ఎలిజిబెత్, పవన్‌కుమార్, డాక్టర్ భగీరథ, సీడబ్ల్యూసీ చైర్మన్ రామాంజనేయులు, వివిధ సంస్థల ప్రతినిధులు కట్టా శ్రీనివాసరావు, వాసాని అంకబాబు, పీర్‌బాషా పాల్గొన్నారు.