విద్య, వైద్య కార్పొరేషన్ డైరెక్టర్‌గా చెన్నకేశవులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:36 PM
ఏపీ విద్య, మౌలిక వసతుల కార్పొరేషన్ డైరెక్టర్‌గా కంభం మండలానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
కంభం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఏపీ విద్య, మౌలిక వసతుల కార్పొరేషన్ డైరెక్టర్‌గా కంభం మండలానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గోన చెన్నకేశవులును కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం అమరావతి రావాల్సిందిగా సమాచారం అందడంతో ఆయన అమరావతి వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం చెన్నకేశవులు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ పదవి వచ్చేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.