Share News

వైభవంగా చెన్నుని వసంతోత్సవం

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:12 PM

శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం నాలుగో రోజు వసంతోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధా న అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యు లు చెన్నకేశవ స్వామి మూలవిరాట్‌కు వసంతం చల్లి అనంతరం ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు.

వైభవంగా చెన్నుని వసంతోత్సవం
శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవుడు

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం నాలుగో రోజు వసంతోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధా న అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యు లు చెన్నకేశవ స్వామి మూలవిరాట్‌కు వసంతం చల్లి అనంతరం ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. మధ్యరంగ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి వసంతోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పసుపు, చందనం, సుగంధభరిత ద్రవ్యాలు కలిపి భక్తులపై వసంతాలు చల్లారు. ఉభయదాతలుగా మద్దెల రంగారావు, సీతారావమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో కనులపండువుగా నగరోత్సవంలో విహరించారు. ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి, ఉత్సవ సేవా సంఘం అధ్యక్షుడు యక్కలి కాశీవిశ్వనాథం, సభ్యులు పాల్గొన్నారు.

నేడు ఊంజల్‌ సేవ

చెన్నకేశవస్వామికి సోమవారం లక్ష్మీ చెన్నకేశవ వికాసతరంగిణి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:12 PM