Share News

మార్కాపురం జిల్లా ప్రకటనపై హర్షం

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:43 PM

మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను తీర్చారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం సీఎంకు కృతజ్ఞతగా టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు.

మార్కాపురం జిల్లా ప్రకటనపై హర్షం
సీఎం బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను తీర్చారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బుధవారం సీఎంకు కృతజ్ఞతగా టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అంతకుముందు కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఎరిక్షన్‌బాబుకు తినిపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం జిల్లాపై ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నారని ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, మండలాధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, పోట్ల గోవింద్‌, మేకల వళరాజు, షేక్‌మాబు, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం : ప్రెస్‌క్లబ్‌ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబ చిత్రపటానికి బీజేపీ నాయకులు బుధవారం ఉదయం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌ ప్రజలకు నేడు పండగ రోజు అన్నారు. మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సుల మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం సంతోషదాయకమన్నారు. ఎన్నికల్లో ఇచ్చి న మాటను చంద్రబాబు నెరవేర్చారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజ ల పక్షాన ఉందని నిరూపితమైందన్నారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనానికి గురైందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల తలరాత మా రబోతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, శాసనాల సరోజిని, మద్దెల లక్ష్మి, మొర్రిబోయిన చిన్నయ్య, దేవిశెట్టి చంద్రశేఖర్‌, సానికొమ్ము వెంకేటశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:43 PM