Share News

చైల్డ్‌ కేర్‌ లీవ్‌రూల్స్‌ జీవో జారీపై హర్షం

ABN , Publish Date - Dec 18 , 2025 | 10:35 PM

చైల్డ్‌ కేర్‌ లీవ్‌రూల్స్‌ విషయంలో పిల్లల గరిష్ట వయోపరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మహిళా ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.

చైల్డ్‌ కేర్‌ లీవ్‌రూల్స్‌ జీవో జారీపై హర్షం
ప్రభుత్వం జారీ చేసిన జీవోతో మహిళా ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు

మహిళా ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు

విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : చైల్డ్‌ కేర్‌ లీవ్‌రూల్స్‌ విషయంలో పిల్లల గరిష్ట వయోపరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మహిళా ఉద్యోగుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌ రూల్స్‌ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో గురువారం త్రోవగుంట జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, ఒంగోలులోని మునిసిపల్‌ హైస్కూలు, సంతనూతలపాడులోని ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకే్‌షలకు కృతజ్ఞతలు తెలిపారు. జీవో జారీ చేసేందుకు కృషి చేసిన పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమాల్లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ అంజిరెడ్డి, రమణారెడ్డి, గౌరవాధ్యక్షుడు పులి శ్రీనివాసరావుతో పాటు పలువురు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 10:35 PM