మమ్దాని గెలుపుపై హర్షం
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:51 PM
ప్రపంచ ఆర్థిక రాజఽ దాని న్యూయార్క్ నగర మేయర్‌గా సోషలిస్టు భావాలున్న జోహ్రన్ మమ్దా ని గెలుపు అమెరికా గడ్డపై ప్రత్యామ్నాయ గళాన్ని ప్రతిబింబిస్తుందని సీ పీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే.మాబు అన్నారు.
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక రాజఽ దాని న్యూయార్క్ నగర మేయర్‌గా సోషలిస్టు భావాలున్న జోహ్రన్ మమ్దా ని గెలుపు అమెరికా గడ్డపై ప్రత్యామ్నాయ గళాన్ని ప్రతిబింబిస్తుందని సీ పీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే.మాబు అన్నారు. గురువారం సాయంత్రం సీపీఎం ఆధ్వర్యంలో అభినందన వేడుకలు నిర్వహించారు. జి.రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాబు మాట్లాడుతూ మామ్దాని గెలుపు ప్రపంచంలో అభ్యుదయ, ప్రగతిశీల శక్తులకు నైతిక బలం ఇస్తుందన్నారు. న్యూయర్క్ గడ్డపై ఆయన గెలుపు సామ్రాజ్యవాదులకు గోడ్డలిపెట్టు వంటి దని చెప్పారు. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా సామ్రాజ్యవాది ట్రంప్, మ రో ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్దాని గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. కార్యక్రమంలో నాయకులు జీవీ.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, పమిడి వెంకట్రావు, కాలం సు బ్బారావు, బి.రఘురాం, వి.బాలకోటయ్య, కె.రమాదేవి, ఉబ్బా ఆదిలక్ష్మి, జి.శ్రీ నివాసులు, నెర్సుల వెంకటేశ్వర్లు, టి.మహేష్, సీహెచ్.వినోద్, కేఎఫ్‌బాబు, ఆదిలక్ష్మి, శేషయ్య, సీహెచ్.రాంబాబు, జాలా అంజయ్య పాల్గొన్నారు.