Share News

స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో అవకతవకలకు చెక్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:43 PM

క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన నూతన స్మార్ట్‌ కార్డుల పంపిణీతో బోగస్‌ రేషన్‌ కార్డులు, ప్రజా పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం కంభం పట్టణంలోని రామాలయం వీధి, గచ్చుకాలువ, తిప్ప వీధుల్లో ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి ఇంటింటికీ తిరిగి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో అవకతవకలకు చెక్‌
కంభంలో స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన నూతన స్మార్ట్‌ కార్డుల పంపిణీతో బోగస్‌ రేషన్‌ కార్డులు, ప్రజా పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం కంభం పట్టణంలోని రామాలయం వీధి, గచ్చుకాలువ, తిప్ప వీధుల్లో ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి ఇంటింటికీ తిరిగి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పౌరసరఫరాల శాఖలో నూతన అధ్యాయానికి స్మార్ట్‌ కార్డుల పంపిణీతో తెరలేపారన్నారు. దీనివల్ల అర్హులందరికీ సరుకులు సక్రమంగా అందుతాయి అన్నారు. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు ఉంటాయన్నారు. 16నెలల పాలనలో జిల్లాలో 20వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి పనులు చేపడుతున్నారని అశోక్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కిరణ్‌, ఎంపీడీవో వీరభద్రాచారి, టీడీపీ మండల అధ్యక్షుడు తోట వెంకట శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పూనూరు భూపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ తోట మహాలక్ష్మి, సొసైటీ బ్యాంకు చైర్మన్‌ కేతం శ్రీను, గోన చెన్నకేశవులు, నాయకులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలోని 7వ వార్డులో శనివారం స్మార్ట్‌ రేషన్‌ కార్డులను మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఈవీ రమణబాబు, కౌన్సిలర్‌ బిల్లా జయలక్ష్మి, టీడీపీ నాయకులు బిల్లా రమేష్‌, పసుపులేటి శ్రీనివాసులు, మహిళ నాయకులు బొంతా లక్ష్మీదేవి పంపిణీ చేశారు. మండలంలోని ఉయ్యాలవాడ పంచాయతీలో గల అంకనాంపల్లెలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌ బోదనబోయిన గోపాలక్రిష్ణయాదవ్‌ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పాపిరెడ్డి నారాయణరెడ్డి, మండల ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్‌ మౌళాలి పాల్గొన్నారు.

పొదిలి : కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను శనివారం రత్నం డీలర్‌షాపులో వినియోగదారులకు తహసీల్దార్‌ కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా ఉండేందకు స్మార్ట్‌రేషన్‌ కార్డ్‌లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజల సౌలభ్యాన్ని స్మార్ట్‌ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : మండలంలోని బోడపాడు, నాయుడుపల్లి, దరిమడుగు, పెద్ద యాచవరం తో పాటు పలు గ్రామాలలో శనివారం రెవెన్యూ అధికారులు కూటమి నాయకులతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమం లో బోడపాడులో వీఆర్వో డీ రామయ్య, టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి, రేషన్‌ కార్డుల లబ్ధిదారులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు ఉన్నా యని టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ మాబు అన్నారు. తహసీల్దారు కా ర్యాలయం వద్ద నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను డిప్యూటీ తహసీల్దార్‌ మల్లికార్జున నాయుడు, షేక్‌ మాబు, నాయకులు శనివారం లబ్ధిదారులకు అందజేశా రు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నా యకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, సుబ్బారెడ్డి, రావెళ్ల సత్యనారాయణ, షేక్‌ మౌలాలి, రఫీ పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : స్మార్ట్‌ రేషన్‌ కార్డులు సమర్థవంతమైన పాలన, సేవలకు నిదర్శనమని ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త స్మార్ట్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్డులతో అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు సక్రమంగా రేషన్‌ సరుకులు అందుతాయని చేకూరి తెలిపారు. కార్యక్రమంలో డీటీ భాస్కర్‌, నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, సత్యనారాయణగౌడ్‌, అచ్యుతరావు, వెంకటసుబ్బయ్య. మస్తాన్‌ వలి, మంత్రునాయక్‌, అంజయ్య, రమేష్‌, సర్పంచులు, డీలర్లు, కార్డుదారులు పాల్గొన్నారు.

రాచర్ల : స్మార్ట్‌ కార్డుల వలన అక్రమాలకు చెక్‌ పడుతుందని తహసీల్దార్‌ ఎల్‌.వెంకటేశ్వర్లు అన్నారు. స్మార్ట్‌ కార్డులను శనివారం ఆయన రాచర్ల, అనుములపల్లి గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. డీలర్లు మోసాలు, అక్రమాలు చేసే అవకాశం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె యోగానంద్‌, నాయకులు పి సుధీర్‌కుమార్‌రెడ్డి, సనావుల్లా ఖాన్‌, ఎస్‌ కల్యాణ్‌ రెడ్డి, యు శంకర్‌ నాయుడు, డి కాశిరెడ్డి, పి బాలకృష్ణ, ఎస్‌ వెంకటపతి, బి కాశయ్య, పిచ్చయ్య, టి రమేష్‌ పాల్గొన్నారు.

పెద్దారవీడు : సుపరిపాలనతో వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని దేవరాజుగట్టులో కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతముగా తీర్చీదిద్దేందుకు రూ.15కోట్లతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. పేదలకు రేషన్‌ సరుకులు సక్రమంగా అందించాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్‌ కార్డులను అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌, మండల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:44 PM