Share News

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎనలేని కృషి

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:15 PM

రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనలేని కృషి చే స్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో 75కేజీల భారీ కేకును కట్‌ చేసి నాయకులకు, శ్రేణులకు పంచిపెట్టారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎనలేని కృషి
సీఎం చంద్రబాబు పుట్టినరోజు కేకు కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనలేని కృషి చే స్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో 75కేజీల భారీ కేకును కట్‌ చేసి నాయకులకు, శ్రేణులకు పంచిపెట్టారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ సీ ఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భ విష్యత్తు వంటివారని అన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు. ఆయన సారథ్యంలో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నామ న్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మరో పాతికేళ్ళు వెనక్కుపోయిందన్నారు. ఈతరుణంలో ప్రజ లు చంద్రబాబుపై విశ్వాసంతో గెలిపించుకున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకూడదనే సంకల్పంతో వయసును కూడా ఖాతరు చేయకుండా 25ఏళ్ళ యువకుడిలా కష్టపడుతున్నారన్నారు. ఆయన పాలనలో తిరిగి రాష్ట్రం గాడిలో పడి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భేరి పుల్లారెడ్డి, వీవీఆర్‌ మనోహరరావు, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, రోష న్‌సంధాని, జనసేన నాయకుడు వరికూటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

పామూరులో.. పామూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన కేకును కట్‌చేసి, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షు డు షేక్‌ ఖాజారహంతుల్లా, మా జీ సర్పంచ్‌ డీవీ మనోహర్‌, ఉప్ప లపాటి హరిబాబు, బీజేపీ నియో జకవర్గ కన్వీనర్‌ కేవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మండ లంలోని కంభాలదిన్నె, వగ్గంపల్లి, రావిగుంటపల్లి గ్రామాల్లో చంద్ర బాబు జన్మదిన సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. సీఎస్‌పురం మం డల కేంద్రంలోని పార్టీ కార్యా లయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో బొమ్మనబోయిన వెంగయ్య, బొబ్బూరి రమేష్‌, ఎన్‌సీ మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

పీసీపల్లిలో.. పీసీపల్లి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): చంద్ర బాబు జన్మదిన సందర్భంగా మండలంలోని పీసీపల్లి, మారెళ్ల, పెదయిర్లపాడు, నేరేడుపల్లి తదితర గ్రామాల్లో కేకు కట్‌చేసి శ్రేణులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య, ఏనుగంటి చిన్నా, ములకా నాగేశ్వరరావు, ఏనుగంటి బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:15 PM