చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ABN , Publish Date - May 25 , 2025 | 10:45 PM
రేషన్ పంపిణీని తిరిగి రేషన్ డీలర్లకు అప్పగించడంపై మండల డీలర్లు ఆదివారం పొదిలిలో డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పొదిలి, మే 25 (ఆంధ్రజ్యోతి) : రేషన్ పంపిణీని తిరిగి రేషన్ డీలర్లకు అప్పగించడంపై మండల డీలర్లు ఆదివారం పొదిలిలో డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం డీలర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌస్ బాషా మాట్లాడుతూ డీలర్లను కాదని జగన్‌రెడ్డి ఇంటింటికీ బియ్యం పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తిరిగి డీలర్లకు ఆ బాధ్యతను అప్పగించడం హర్షణీయమన్నారు. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 29వేల మంది డీలర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మాపై నమ్మకంతో తిరిగి అప్పగించడానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకే్‌షకు కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా వాహన ఆపరేటర్లకు ఉచితంగా వాహనాలను వారికే అప్పగించారన్నారు. కార్యక్రమంలో పొదిలి మండల డీలర్ల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, డీలర్లు మట్టా నరసింహారావు, మస్తాన్‌వలి, కాశిరెడ్డి, ఆదిరెడ్డి, నరసారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, విలేకరి శ్రీను, అనీల్, కాటూరి శ్రీనివారావు, సింహాద్రి పాల్గొన్నారు.