Share News

హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:41 PM

హామీలిచ్చి వాటిని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆకవీడు గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే
ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రాచర్ల, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : హామీలిచ్చి వాటిని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆకవీడు గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన ఇటంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు విరించారు. అనంతరం వారికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల వేళ చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రకటించిన మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అశోక్‌రెడ్డి తెలిపారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాలు అమలయ్యాయన్నారు. అన్నదాత సుఖీభవ కొద్దిరోజుల్లో అందిస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని రూ.3వేలు ఈ ఏడాదిలోనే ఇస్తామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అశోక్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:41 PM