ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:47 PM
వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం లేక విసిగివేసారిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలలకే అన్ని విధాలా ప్రయోజనం చేకూర్చి విజయం సాధించిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉత్తమ టీడీపీ కార్యకర్త ప్రశంసాపత్రాలను 43 మందికి ఆయన పంపిణీ చేశారు.
43మందికి అందజేసిన
ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం లేక విసిగివేసారిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలలకే అన్ని విధాలా ప్రయోజనం చేకూర్చి విజయం సాధించిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉత్తమ టీడీపీ కార్యకర్త ప్రశంసాపత్రాలను 43 మందికి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసిన 43 మందికి ఉత్తమ కార్యకర్తలుగా అధిష్టానం ఎంపిక చేసి, ప్రశంసాపత్రాలను పంపించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ అధినాయకత్వం గుర్తుంచుకొని తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. మార్కాపురం జిల్లా ప్రకటన, వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రజల కోరికను తీర్చారన్నారు. సీఎం చంద్రబాబుకు మనంతా కృతజ్ఞతలు తెలపాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేయడంతోపాటు పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు శ్రమించాలని ఎరిక్షన్‌బాబు కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పీ గోవింద్, రాజు, షేక్ మాబు, శ్రీనివాసరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.