ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కేంద్ర బృందం
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:41 PM
పీసీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రబృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. డాక్టర్ అజయ్ మిశ్రా నేతృత్వంలోని బృందం సభ్యులు వైద్యశాలలో వైద్యులు, రోగులతో విడివిడిగా సమావేశమయ్యారు. పీహెచ్‌సీ పరిధిలోని పీఎంఎస్‌ఎంఎ ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను వైద్యులు యషిత, మంజులను అడిగి తెలుసుకున్నారు.
పీసీపల్లి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): పీసీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రబృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. డాక్టర్ అజయ్ మిశ్రా నేతృత్వంలోని బృందం సభ్యులు వైద్యశాలలో వైద్యులు, రోగులతో విడివిడిగా సమావేశమయ్యారు. పీహెచ్‌సీ పరిధిలోని పీఎంఎస్‌ఎంఎ ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను వైద్యులు యషిత, మంజులను అడిగి తెలుసుకున్నారు. కుక్కకాటు, పాముకాటు ఇంజెక్షన్‌లు సరిపడా అందుబాటులో ఉన్నాయా, లేదా ఆరాతీశారు. రోజువారీ వెైద్యశాలకు ఎన్ని ఓపీలు వస్తున్నాయి, నెలలో ఎన్ని కాన్పులు జరుగుతున్నాయని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యకేంద్రంలో అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల పరిసరాలను పరిశీలించిన బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రబృందంలో ఎం.చరిత, ఎన్.వర్ష, ఎ.భార్గవి, ఎస్‌డీ హకీమ్, కేవీ సుబ్బలక్ష్మి తదితరులు ఉన్నారు.