Share News

గూడేంలో కేంద్రం బృందం పర్యటన

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:35 PM

మండలంలోని తుమ్మలబైలు చెంచు గిరిజన గూడెంలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. గ్రామీణాభివృద్ధి శా ఖల ద్వారా అమలువుతున్న పథకాలపై బృంద సభ్యులు గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు.

గూడేంలో కేంద్రం బృందం పర్యటన

పథకాల అమలుపై ఆరా

ప్రోత్సాహాన్ని అందించండి

చెంచు మహిళల విజ్ఞప్తి

పెద్దదోర్నాల, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తుమ్మలబైలు చెంచు గిరిజన గూడెంలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. గ్రామీణాభివృద్ధి శా ఖల ద్వారా అమలువుతున్న పథకాలపై బృంద సభ్యులు గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. వాటి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని తుమ్మలబైలు గిరిజన గ్రామాన్ని కేంద్ర గ్రామాభివృద్ధి శాఖ దిశ విభాగం జాయిం ట్‌ డైరెక్టర్‌ ఉమేష్‌ కుమార్‌రామ్‌, అడ్మిన్‌స్టేటివ్‌ అధికారి జీఎస్‌ రావత్‌, కమిషనర్‌ ఆఫ్‌ పంచాయతీ రాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌, ఐటీడీఏ స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ కేజీ నాయక్‌ డ్వామా పీడీ జోస్‌ఫకుమార్‌, డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్‌ లక్ష్మీరెడ్డి, ఏపీడీ నిర్మలాదేవి బృందం సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు బృందానికి సాద ర స్వాగతం పలికారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో పథకాలపై చర్చించారు. విస్తర్ల తయారీ కేంద్రానికి బి ల్డింగ్‌ సరిపోలేదని మరో భవనాన్ని ని ర్మించాలని, అదే విధంగా అటవీప్రాంతం లోపలికి మాడపాకులు తెచ్చుకునేందుకు అటవీ శాఖాధికారులు అడ్డుకుంటున్నారని, జూట్‌ సంచుల తయారీకి రా మెటీరియల్‌ సరఫరా చేయాలని చెంచులు బృందం దృష్టికి తెచ్చారు. అంతేగాక కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ త్రీఫేస్‌ సరఫరా ఏర్పాటు చేశారని తమ గ్రామానికి చేయలేదని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ద్వారా సాగు చేసిన మామిడి తోటను బృందం పరిశీలించింది. జలసిరి ద్వారా బోరుబావులు తవ్విస్తే మరిన్ని ఎకరాలు పండ్ల తోటలు సాగు చేస్తామని గిరిజనులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం లో ఉపాధి పనుల చేసేందుకు కుటుంబ పోషణ నిమిత్తం ముందుగానే అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ఇచ్చేవారని మళ్లీ ఇప్పుడు ఆ మాదిరిగానే ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. సమగ్ర నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని బృందం అధికారులు చెప్పారు. అనంతరం దోర్నాల వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. స్రీనిధి పథకాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

Updated Date - Jun 11 , 2025 | 11:35 PM