శ్మశాన స్థలం సర్వే
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:23 PM
తర్లుపాడులో ఆక్రమణకు గురవుతున్న హిందూ శ్మశాన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఆ స్థలాన్ని సర్వే చేశారు. సుమారు 90సెంట్ల భూమి ఆక్రమణకు ప్రయత్నం జరిగిన విషయం వాస్తమేనని తేల్చారు.
ఆక్రమణ వాస్తవమేనన్న రెవెన్యూ అధికారులు
చదును చేయించింది ప్రభుత్వ ఉద్యోగి అని నిర్ధారణ
తర్లుపాడు, డిసెంబరు 14 (ఆంధ్రజోతి) : తర్లుపాడులో ఆక్రమణకు గురవుతున్న హిందూ శ్మశాన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఆ స్థలాన్ని సర్వే చేశారు. సుమారు 90సెంట్ల భూమి ఆక్రమణకు ప్రయత్నం జరిగిన విషయం వాస్తమేనని తేల్చారు. ‘శ్మశాన భూమి కబ్జాకు యత్నం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఆర్‌ఐ చరణ్, సర్వేయర్ సురేష్, వీఆర్వో మస్తాన్ రంగంలోకి దిగారు. శ్మశాన స్థలాన్ని సర్వే చేశారు. అక్కడ సమాధులను కూడా చదును చేసినట్లు గుర్తించారు. 81-1 సర్వే నంబర్‌లో మొత్తం 1.76 సెంట్లు ఉండగా 90 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నించింది ప్రభుత్వ ఉద్యోగి అన్న నిర్ధారణకు వచ్చారు. ఆయన్ను సోమవారం కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తహసీల్దార్ కేకే కిషోర్‌కుమార్ తెలిపారు. సోమవారమే ఉన్నతాధికారులకు నివేదిక కూడా పంపుతానని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.