సాయం చేయాలని వెళితే ..సెల్‌ఫోన్ల చోరీ
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:01 PM
‘మార్టూరు సెంటర్‌లో బైక్‌పై ఉన్న యువకుడు సడన్‌గా కిందపడ్డాడు. సాయం చేసేందుకు ఓ వ్యక్తి ఆ యవకుడి వద్దకు వెళ్లాడు. కింద పడిన వ్యక్తికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? అని చూస్తూ సదరు వ్యక్తి యువకుడిని పక్కకు తీసి బైకు పైకి లేపాడు.
మార్టూరు, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): ‘మార్టూరు సెంటర్‌లో బైక్‌పై ఉన్న యువకుడు సడన్‌గా కిందపడ్డాడు. సాయం చేసేందుకు ఓ వ్యక్తి ఆ యవకుడి వద్దకు వెళ్లాడు. కింద పడిన వ్యక్తికి ఏమైనా దెబ్బలు తగిలాయా..? అని చూస్తూ సదరు వ్యక్తి యువకుడిని పక్కకు తీసి బైకు పైకి లేపాడు. ఇదే సమయంలో మరో యువకుడు వారి వద్దకు వచ్చాడు. వీరికి సాయం చేస్తున్నట్లు నటిస్తూనే చాకిచక్యంగా చొక్కాజేబులోని సెల్ ఫోన్‌ను చోరీ చేశాడు. అదే బైకుపై ముందు కిందపడిన యువకుడు, సాయం చేసేందుకు వచ్చిన యువకుడు తర్రుమంటూ పారి పోయారు. ఏం జరిగింది..? ఎందుకు అంత వేగంగా ఈ ఇరువురు యువకులు పారి పోయారు అని అర్థం చేసుకొని లోపే తన సెల్‌ఫోన్ చోరీకి గురైందని తెలుసుకొని అవాక్కవడం సదరు వ్యక్తి వంతైంది.’ ఇది ఈ ఒక్క ఘటనే కాదు.. ఇలాంటి ఘటనలు ఇటీ వల మార్టూరులో చాలానే జరిగాయి. గత ఆరు నెలలో పది వరకు ఇలాంటి ఘటనలు జరిగినా.., పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. బాధితుల్లో కొంత మంది పోలీసు స్టేషన్‌కే పోకపోగా, కొద్దిమంది వెళ్లి ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం కూడా వీరికి మరిం త స్వేచ్ఛ నిస్తుం డడం గమనార్హం.
ఓ ఘటనలో సీసీ టీవీలో రికార్డయినా...
ఇలాంటి ఘటనలు చాలా వరకు సీసీ టీవీల్లో కూడా ఎక్కడా రికార్డు కాలేదు. కానీ వారం రోజుల క్రితం రూపాంజలి లాడ్జి ముందు బేల్దారి మేస్త్రీ కొండలు అనే వ్యక్తి వీరి బారిన పడడం అక్కడ రికార్డయ్యింది. పుటేజీలలో స్పష్టత కొరవడడంతో వారి ఆచూకీ తెలియలేదు. అదిగాకుండా పోలీసులు కూడా సెల్‌ఫోన్ దొంగతనాలను సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రజానీకం వాపోతు న్నారు.
బాధితులు చాలా మందే ఉన్నారు...
ఫ మార్టూరు సెంటర్లో రవీంద్ర బేకరీ ఎదురుగా మక్కెన సాంబశివరావు అనే గ్రానైట్ వ్యాపారి వద్ద నుంచి బైక్ వాలాలు రూ.లక్ష విలువైన సెల్‌ఫోన్‌ను ఎత్తుకు పోయారు. వారిని వెండించాలని సాంబ శివరావు ప్రయత్నించినా సాద్యపడలేదు.
ఫ గన్నవరం రోడ్డులో నాయుడు శ్రీను అనే వ్యక్తి వద్ద ఇదేవిధంగా రూ.70 వేల ఖరీదైన సెల్‌ఫోన్‌ను ఎత్తుకు పోయారు.
ఫ నాగరాజుపల్లి కూడలిలో శ్రీను అనే గ్రానైట్ వ్యాపారిని మోసం చేసి రూ.50 వేల విలువైన సెల్‌ఫోన్‌ను కాజేశారు
ఫ రవితేజ ఆటో మొబైల్ షాపు యజమానిని మోసం చేసి ఖరీదైన సెల్‌ఫోన్ ను ఎత్తుకు పోయారు.
ఫ మార్టూరులో సాయిబాబా గుడి వద్ద ఇంటిలోపలకు వెళుతున్న పూజారి హరిబాబును మోసం చేసి సెల్‌ఫోన్ ను కాజేశారు. అంతేగాకుండా అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న 25 వేల రూపాయలు నగదును కూడా డ్రాచేసుకున్నారు.
ఫ మార్టూరు సెంటర్లో పూలదుకాణం వద్ద ఎం.ఈశ్వరప్రసాద్ అనే ఉపాధ్యాయున్ని మోసం చేసి రూ.50 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను క్షణాల్లో కాజేశారు.