Share News

జీఎస్టీ తగ్గింపుతో సంబరాలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:37 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి రావడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైసీయోగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కాంప్లెక్స్‌ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జీఎస్టీ తగ్గింపుతో సంబరాలు
కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్న బీజే పీ నాయకులు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి రావడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైసీయోగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కాంప్లెక్స్‌ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సోమవారం నుంచి అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను-2 వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గాయన్నారు. 395 రకాల వస్తువుల ధరలు భారీగా తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనంగా ఉంటుందని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలసంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శెగ్గం శ్రీనివాసులు, నాయకులు మాకినేని నరసింహం, సీతారామయ్య, బి. విజయారావు, శ్రీలక్ష్మి, జిల్లెళ్ళమూడి రమాదేవి, రాజేష్‌ వర్మ, మోజేష్‌, రాధాకృష్ణ, సత్యనారాయణ, గుర్రం రంగనాఽథ్‌, కొమ్ము శ్రీనివాసరావు, రవీంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:37 AM