వైభవంగా దసరా శరన్నవరాత్రులు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:35 PM
అమ్మలగన్న అమ్మ.. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ జగన్మాతకు దసరా శరన్ననవరాత్రులు పురస్కరించుకుని పట్టణంలో అమ్మవార్లు బుధవారం వి విధ అలంకారాల్లో భక్తలకు దర్శనం ఇచ్చారు.
మార్కాపురం వన్‌టౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : అమ్మలగన్న అమ్మ.. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ జగన్మాతకు దసరా శరన్ననవరాత్రులు పురస్కరించుకుని పట్టణంలో అమ్మవార్లు బుధవారం వి విధ అలంకారాల్లో భక్తలకు దర్శనం ఇచ్చారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మిగా, మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ సిద్ధిదాయినిగా వాసవీ మాత గజలక్ష్మి భక్తులకు దర్శనం ఇచ్చారు. జవహర్ నగర్‌లోని ఆమలక లక్ష్మీనారాయణ ఆలయంలో గజలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు.
గిద్దలూరు : దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు వారాహీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల సందర్భంగా దేవాలయంలో చండీహోమం నిర్వహించారు. షరాఫ్ బజారులోని వేంకటేశ్వరస్వామి వామన అవతారంలో దర్శనమిచ్చారు.
త్రిపురాంతకం : త్రిపురాంతకేశ్వరస్వామి బాలాత్రిపురసుందరిదేవి ఆలయంలో అమ్మవారు బుధవారం సిద్ధిదాయనిగా అశ్వవాహనంపై భ క్తులకు దర్శనమిచ్చింది. బాలా త్రిపురసుందరీదేవిని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు దర్శించుకున్నారు.
పెద్దదోర్నాల : దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. వాసవీమాత, పోలేరమ్మ సాయిబాబా మందిరం, తిమ్మాపురంలోని శ్రీ చౌడేశ్వరీదేవిఆలయంలో పూజలు నిర్వహించారు.
కంభం : శ్రీ కోటా సత్యమాంబదేవి శ్రీ బాల హృదయేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ మహంకాళీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.