Share News

గొడ్డలిపోటు దినం నిర్వహించుకోండి

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:33 PM

వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంకు బదులు గొడ్డలిపోటు దినం నిర్వ హించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చ య్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, రూరల్‌ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దర్శిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు.

గొడ్డలిపోటు దినం నిర్వహించుకోండి
మాట్లాడుతున్న మున్పిపల్‌ చైర్మన్‌ పిచ్చయ్య, టీడీపీ నాయకులు

వైసీపీ నాయకులకు మున్సిపల్‌ చైర్మన్‌

నారపుశెట్టి పిచ్చయ్య సూచన

దర్శి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంకు బదులు గొడ్డలిపోటు దినం నిర్వ హించుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చ య్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, రూరల్‌ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దర్శిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడారు. వెన్నుపోటు రాజకీయా లకు జగన్‌ పేటెంట్‌ అని చెప్పారు. బాబాయిని గొడ్డలి పోటుతో చంపించి గుండెపోటని డ్రామాలాడిన వైసీపీ నాయకులకు ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధిరాలేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంతప్పకుండా పింఛ న్లు, జీతాలు ఇవ్వటంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజాసంక్షేమ పాలననను చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిం చేందుకు వెన్నుపోటు దినం నిర్వహణకు పిలుపునివ్వటం శోచనీయమన్నారు. దర్శి ని యోజకవర్గంలో వైసీపీ పా లనలో నిలిచిన అభివృద్ధి ప థకాలు శరవేగంతో సాగుతు న్నాయన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇక్కడ జరుగు తున్న అభివృద్ధిని చూసి ఓ ర్వలేక ఆందోళన కార్యక్రమా లకు పిలుపునివ్వటం సిగ్గుచే టన్నారు. సమావేశంలో టీడీ పీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, దారం సుబ్బారావు, శ్రీనాథ్‌, రూపినేని వెంకటరావు, ఊరిబిండి మధు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 10:33 PM