Share News

పట్టుకున్నారు.. వదిలేశారు!

ABN , Publish Date - May 24 , 2025 | 01:21 AM

అలా పట్టుకుంటారు.. ఇలా వదిలేస్తారు.. మధ్యలో మాత్రం మంత్రాంగం నడుస్తుంది! ఇదీ జిల్లాలో ఎక్సైజ్‌ అధికారుల తీరు. మొత్తంగా వారి చర్యలు అంతటా చర్చనీయాంశమయ్యాయి. ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌ చేసి ఎమ్మార్పీ కంటే అదనంగా క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 పెంచి విక్రయిస్తూ ఓ మద్యం దుకాణం వారు పట్టుబడ్డారు.

పట్టుకున్నారు.. వదిలేశారు!

ఇదీ ఎక్సైజ్‌ అధికారుల మాయ

ఒంగోలు క్రైం, మే 23 (ఆంధ్రజ్యోతి): అలా పట్టుకుంటారు.. ఇలా వదిలేస్తారు.. మధ్యలో మాత్రం మంత్రాంగం నడుస్తుంది! ఇదీ జిల్లాలో ఎక్సైజ్‌ అధికారుల తీరు. మొత్తంగా వారి చర్యలు అంతటా చర్చనీయాంశమయ్యాయి. ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌ చేసి ఎమ్మార్పీ కంటే అదనంగా క్వార్టర్‌ బాటిల్‌కు రూ.10 పెంచి విక్రయిస్తూ ఓ మద్యం దుకాణం వారు పట్టుబడ్డారు. అయితే జిల్లా ఎక్సైజ్‌ అధికారులు వ్యవహారం నడిపి వదిలేశారు. జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా ఉన్నాయి మొత్తం వివరాలను పరిశీలించిన ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇటీవల ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్వక్తం చేశారు. అంతేకాదు కీలక అధికారులకు జాగ్రత్త అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ఉన్న తనిఖీ బృందాలకు మద్దిపాడు మండలం కొట్టాలు సెంటర్‌లో ఓ మద్యం దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే జిల్లాకు చెందిన ఓ ఎక్సైజ్‌ అధికారి రంగంలోకి దిగి తన మార్కు మంత్రాంగం నడిపి ఏమీ జరగలేదన్నట్లుగా బయటకు చెప్పారు. అయితే అక్కడ పట్టుకున్న అధికారులకు భారీగా చేతులు తడిపినట్లు ప్రచారం జరుగుతోంది. కంచే చేను మేసినట్లుగా ఎమ్మార్పీ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలా మిన్నకుండిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Updated Date - May 24 , 2025 | 01:21 AM