Share News

జీజీహెచ్‌లో క్యాన్సర్‌ నిర్ధారణ వైద్య పరికరం

ABN , Publish Date - May 27 , 2025 | 01:27 AM

ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అధునాతన ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ (ఐహెచ్‌సీ) పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏడుకొండలు సోమవారం ప్రారంభించారు.

జీజీహెచ్‌లో క్యాన్సర్‌ నిర్ధారణ వైద్య పరికరం
క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష యంత్రాన్ని ప్రారంభిస్తున్న ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏడుకొండలు, హెచ్‌వోడీలు, వైద్యులు

ప్రారంభించిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని వెల్లడి

ఒంగోలు, కార్పొరేషన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అధునాతన ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ (ఐహెచ్‌సీ) పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏడుకొండలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ నిర్ధారణ, దశ, చికిత్సలో ఈ పరికరం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వైద్య పీజీ కళాశాల నిధులు రూ.40లక్షలు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఉచితంగా సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, హెచ్‌వోడీలు, డాక్టర్లు, సుధాకర్‌, దుర్గాదేవి, అటానమీ హెచ్‌వోడీ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 01:27 AM