Share News

రూ.75లక్షలతో కాలువల మరమ్మతులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:16 AM

త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మేజర్‌ కాలువల మరమ్మతులకు నిధులు మంజూరయ్యా యి. కాలువలపై చిల్లచెట్లు పెరిగిపోయి కొన్నిచోట్ల, కాలువల్లో వ్యర్ధాలు పేరుకుపోయి పూడిక నిండి మరికొన్నిచోట్ల ఉండగా వాటికి గాను మొత్తం 20 పనులకు 75లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

రూ.75లక్షలతో కాలువల మరమ్మతులు
మరమ్మతుల తరువాత ముడివేముల మేజర్‌ కాలువ

మేజర్‌ల కోసం నిధులు మంజూరు

సాగర్‌ నీటి సరఫరాకు తొలగిన ఇబ్బందులు

త్రిపురాంతకం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మేజర్‌ కాలువల మరమ్మతులకు నిధులు మంజూరయ్యా యి. కాలువలపై చిల్లచెట్లు పెరిగిపోయి కొన్నిచోట్ల, కాలువల్లో వ్యర్ధాలు పేరుకుపోయి పూడిక నిండి మరికొన్నిచోట్ల ఉండగా వాటికి గాను మొత్తం 20 పనులకు 75లక్షల రూపాయలు మంజూరయ్యాయి. చెట్లు తొలగించటం, కాలువల్లోని వ్యర్థాలు తొలగించి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చేసేలా ఈ పనులు చేపడుతున్నారు. ఈ పనులను సాగునీటి సంఘాల

అధ్యక్షుడు, ఆయా గ్రామాల్లోని నాయకు లు నామినేషన్‌ పద్ధతిపై చేపట్టి పూర్తి చేస్తున్నారు. సాగర్‌ నీరు విడుదల సమయానికి కాలువలు పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగాల్సి ఉండగా, ఇవి అరకొర నిధులు అంటూ కొందరు పెదవి విరుస్తు న్నా చాలా వరకు ఊరట ఇచ్చినట్లేనని ఎక్కువమం ది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన పనుల వివరాలను పరిశీలిస్తే పుల్లలచెరువు మండల పరిధిలోని నరసాపురం అయ్యవారిపల్లి మేజరుకు రూ.3లక్షల 40వేలు, ఐటివరం సెక్షన్‌ పరిధిలోని ఉమ్మడివరం మేజరు, మైనరు కాలువలకు

రూ.3లక్షలు, ఉమ్మడివరం మేజరు 4.727కి.మీ నుంచి 9.755 వరకు పనులకుగాను రూ.2లక్షల 90వేలు, అన్నసముద్రం మేజర్‌, మైనరు కోసం 3 లక్షల రూ.10వేలు, ముడివేముల మేజరుకు రూ.2 లక్షల 99వేలు, మిరియంపల్లి మేజర్‌కు

రూ.3లక్షల 21వేలు, సోమేపల్లి, విశ్వనాథపురం, వెల్లంపల్లి మేజరుకు రూ.3లక్షల 62వేలు, గొల్లపల్లి, విశ్వనాథపురం, దివిపల్లి మేజర్‌కు రూ.2లక్షల 98వేలు, ఉమ్మడివరం మేజరు 0.000కి.మీ నుంచి 4.727వరకు రూ.3లక్షల

55వేలు మంజూరయ్యాయి. ముడివేముల మేజరు కు రూ.3లక్షల 56వేలు, ముడివేముల 4.391 కి.మీ నుంచి 11.305వరకు పనులకు రూ.3లక్షల 13 వేలు, మిరియంపల్లి మేజరు 0.000కి.మీ నుంచి

8.657 కి.మీ వరకు రూ.3లక్షల 79వేలు, ముడివేముల మేజరు కాలువ బలోపేతం చేయటంకోసం రూ.5లక్షల 10వేలు మంజూరుకాగా పుల్లలచెరువు మండలం ఐటివరం సెక్షన్‌ నుంచి త్రిపురాంతకం మండలంలోని 164.120 కి.మీ వరకు పలుచోట్ల సాగరు ప్రధాన కాలువ మరమ్మతులకోసం మొత్తం 6 పనులకు

రూ.26లక్షల 71వేలతో పనులు చేపడుతున్నారు. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకున్నామని డీఈ విజయలక్ష్మి తెలిపారు.

Updated Date - Jul 18 , 2025 | 01:16 AM