ప్రేమ పేరుతో పిలిచి..
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:12 AM
పరిచయం ఉన్న యువతి ప్రేమగా మాట్లాడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రమ్మని పిలిచి తన ప్రి యుడుతో కలిసి హత్య చేసేందుకు యత్నిం చారు. ఈ సంఘటన ఒంగోలులోని కిమ్స్ ఆ సుపత్రి సమీపంలో గల ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై హత్యాయత్నం
దుండగులతో దాడి చేయించిన ప్రేమికుడు
ఒంగోలులో ఘటన
ఒంగోలు క్రైం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): పరిచయం ఉన్న యువతి ప్రేమగా మాట్లాడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రమ్మని పిలిచి తన ప్రి యుడుతో కలిసి హత్య చేసేందుకు యత్నిం చారు. ఈ సంఘటన ఒంగోలులోని కిమ్స్ ఆ సుపత్రి సమీపంలో గల ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళి తే... ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన ఓ యువతి, యలమంద అనే యు వకుడు ఐదు నెలల క్రితం ఉద్యోగం కోసం హై దరాబాద్ వెళ్ళారు. అక్కడ ఒంగోలు నగరం శ్రీ రామ్‌కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బూసి వెంకటేష్ వారికి పరిచయం అయ్యాడు. ఈక్ర మంలో సదరు యువతికి వెంకటేష్‌తో ప్రే మగా మాట్లాడుతూ సన్నిహితులయ్యారు. ఇ లా నాలుగు నెలలు తరువాత ఆ యువతి, యలమంద కలిసి హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామం వచ్చారు. అయితే వారి ఇరువురు ప్రేమించుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉ న్న వెంకటేష్‌తో తన ప్రియురాలు మాట్లాడు తుందని గుర్తించిన యలమంద ఆమెతో గొడ వపడ్డాడు. ఈక్రమంలో ఇరువురు కలిసి ఓ ప థకం రూపొందించారు. తన ప్రియురాలితో స న్నిహితంగా ఉంటున్న వెంకటేష్‌ను అడ్డు తొల గించాలని యలమంద తన మిత్రులతో కలిసి మాట్లాడుకున్నాడు. ఈనేపథ్యంలో తన ప్రియు రాలితో వెంకటేష్‌కు ఫోన్ చేయించాడు. మనం కలవాలంటూ వెంకటేష్‌ను ఒంగోలుకు పిలి పించారు. కిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్నా నంటూ ఆమెతో ఫోన్ చేయించాడు యల మంద. దీంతో అక్కడకు కారులో వెంకటేష్ రాగానే యలమంద, మరో నలుగురు యువకు లు పూటుగా మద్యం తాగి అతడిని చితకబాది హత్యాయత్నం చేశారు. అదే సమయంలో గ స్తీలో ఉన్న పోలీసులు గుర్తించి అక్కడకు వెళ్లే సరికి దుండగులు పరారీ అయ్యారు. చావుబ తుకుల మధ్య ఉన్న వెంకటేష్‌ను వెంటనే రి మ్స్‌కు తరిలించారు. దుండగులలో ఒకరిని పో లీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.