Share News

బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:37 AM

జిల్లాలో సాగు చేసిన బర్లీ పొగాకు రైతు లను అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతు సం ఘాల నాయకులు కోరారు. తూర్పునాయుడు పాలెంలో ఆదివారం రైతు సంఘాల నాయకు లు మంత్రి డాక్టర్‌ స్వామిని కలిసి సమస్యను వివరించారు.

 బర్లీ పొగాకు  రైతులను ఆదుకోవాలి

మంత్రి స్వామికి రైతు సంఘాల వినతి

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో సాగు చేసిన బర్లీ పొగాకు రైతు లను అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతు సం ఘాల నాయకులు కోరారు. తూర్పునాయుడు పాలెంలో ఆదివారం రైతు సంఘాల నాయకు లు మంత్రి డాక్టర్‌ స్వామిని కలిసి సమస్యను వివరించారు. గత ఏడాది బర్లీ పొగాకు ధరలు ఉండటంతో ఈ ఏడాది కూడా ధరలు బాగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు ప్రోత్సహిం చడంతో రైతులు విస్తారంగా సాగు చేశారన్నా రు. అయితే ఈ పంటను 90శాతం మంది కౌ లు రైతులే సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయం వచ్చే సరి కి కంపెనీల ఏజెంట్లు పొగాకు కొనుగోలు చే యడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త క్కువధరకు కొనుగోలు చేయాలని చూస్తున్నా రని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. బర్లీ పొ గాకుకు గత సంవత్సరం ఇచ్చిన విధంగా టన్ను రూ.18వేలకు కొనిపించాలని, కంపెనీలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవా లని కోరారు. బర్లీ పొగాకును బోర్డు పరిధిలో చేర్చే విధంగా చూడాలనిమంత్రిని కోరారు. కార్యక్రమంలో నాయకులు చుండూరి రంగారా వు, కొల్లా రాజమోహన్‌, జయంతిబాబు, కె.హ నుమారెడ్డి, కె.వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 01:37 AM