ఆర్టీసీ బస్సులో నోట్ల కట్టలు!
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:36 AM
ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. రూ.49.45లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికా రులు బుధవారం తనిఖీలు చేపట్టారు.
రూ.49.45 లక్షలు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
ఒంగోలు, క్రైం 30 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. రూ.49.45లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికా రులు బుధవారం తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. ఆ మొత్తాన్ని తరలిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన గొర్ల సాయిమణికంఠను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చెన్నైలో బంగారం కొనుగోలుకు నగదును తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవ డంతో నగదు మొత్తంతోపాటు సాయిమణికంఠను టంగుటూరు పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ జనార్దన్‌రావు, సీఐలు నరహరిరావు, రామారావు, ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.