Share News

మొక్కజొన్న తోటలో బాలుడి శవం

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:26 PM

మొక్కజొన్న తోటలో అనుమానాస్పదస్థితిలో చెంచు గిరిజన బాలుడి చనిపోయి ఉన్నాడు. ఈ సంఘటన మండలంలోని చిలకచెర్ల గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.

మొక్కజొన్న తోటలో బాలుడి శవం
మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై మహేశ్‌

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

పెద్దదోర్నాల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి) : మొక్కజొన్న తోటలో అనుమానాస్పదస్థితిలో చెంచు గిరిజన బాలుడి చనిపోయి ఉన్నాడు. ఈ సంఘటన మండలంలోని చిలకచెర్ల గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. ఆ మృతదేహం నందిగూడేనికి చెందిన అర్తి నాగన్న(16)గా గుర్తించారు. ఎస్సై మహేశ్‌ తెలిపిన కథనం ప్రకారం... చిలకచెర్ల గ్రామంలో మొక్కజొన్న తోటలో గుర్తు తెలియని శవం ఉందని సమచారం వచ్చింది. సంఘటనా స్థలానికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. తహసీల్దారు అశోక్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో శవాన్ని భూమి నుంచి బయటకు తీయగా నందిగూడెంకు చెందిన గిరిజన బాలుడిగా గుర్తించామన్నారు.తదనంతరం పంచనామా చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

హత్యాయత్నం కేసులో వ్యక్తికి జైలు

రాచర్ల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ సంఘటన శుక్రవారం రాచర్ల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పోతంశెట్టిపల్లికి చెందిన దండూరి సుబ్బయ్యపై కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన భాస్కర్‌ తన పొలం వద్ద ఉన్న కుంటలో దండూరి సుబ్బయ్యకు చెందిన గేదెలు నీళ్లు తాగాయని 2017లో గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సుబ్బయ్య రాచర్ల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై నాగశ్రీను హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై శుక్రవారం మార్కాపురం కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి దేవేంద్రారెడ్డి నెలరోజులు జైలుశిక్ష లేదా రూ.10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Nov 07 , 2025 | 11:26 PM