జనన ధ్రువీకరణ పత్రాలను వెంటనే ఇవ్వాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:07 AM
మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని చి న్నారులకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాల ను మంజూరు చేయాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ రవిని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
మంత్రి డాక్టర్ స్వామి ఆదేశం
సింగరాయకొండ, మే 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని చి న్నారులకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాల ను మంజూరు చేయాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ రవిని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. ఐదేళ్లు నిండి నా పుట్టినరోజు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేక పోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను హెచ్ ఎంలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మ య్య శుక్రవారం టంగుటూరు మండలం తూ ర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయం లో మంత్రిని కలిసి వివరించారు. ఆయనకు వి నతిపత్రం సమర్పించారు. చిన్నారులు అంగన్ వాడీ కేంద్రాలు. పాఠశాలల్లో ప్రవేశాలు పొంద లేకపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందించారు. వెంటనే ఆర్డీవో, తహసీల్దార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. త్వరిత గతిన ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయా లని ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు వేల్పుల వెంకట్రావు, నర్రా రాంబాబు ఉన్నారు.