బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:53 PM
మండలంలోని దివాకరపల్లిలో నిర్మిస్తున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆదేశం
పీసీపల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని దివాకరపల్లిలో నిర్మిస్తున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ప్లాంట్‌ను త్వరగా నిర్మిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అలాగే కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఉపాధి కోసం వలస పోకుండా ఇక్కడే పని దొరుకుతుందని చెప్పారు. తద్వారా వలస నివారణ జరుగుతుందన్నారు. ప్లాంట్ కోసం గడ్డి పెంచేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అందుకోసం తీసుకొచ్చిన నూతన ట్రాక్టర్‌లను పరిశీలించారు. ఆయనవెంట టీడీపీ నాయకులు ఉన్నారు.