అలరించిన ఇస్కాన్ బృందం భజనలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 10:42 PM
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సాగుతోన్న సంపూర్ణ భారత్ పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఆ బృంద సభ్యులు దర్శికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌ఎ్‌సఎస్, హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
దర్శి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సాగుతోన్న సంపూర్ణ భారత్ పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఆ బృంద సభ్యులు దర్శికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌ఎ్‌సఎస్, హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. బృంద సభ్యులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ద్వారక నుంచి పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం శ్రీకృష్ణుడు, శ్రీరాముడిపై పాడిన భక్తిపాటలు, భజనలు మంత్రముగ్దులను చేశాయి. ఈసందర్భంగా భక్తులకు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.