భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:06 AM
ప్రముఖ పర్యాటక శైవ రక్షేత్రమైన భైరవకోనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర, డాక్టర్ కవిత దంపతులు భైరవకోన క్షేత్రాన్ని బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 167-బి హైవేకు సంబంధించి పీడీఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మస్తాన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు.
సీఎ్‌సపురం(పామూరు) నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ పర్యాటక శైవ రక్షేత్రమైన భైరవకోనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర, డాక్టర్ కవిత దంపతులు భైరవకోన క్షేత్రాన్ని బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 167-బి హైవేకు సంబంధించి పీడీఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మస్తాన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు. రాత్రిపూట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నిరోధించడానికి లైటింగ్ ఉపయోగపడుతుందన్నారు. అనంతరం దేవస్థానానికి విచ్చేసిన ఉగ్ర దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రీముఖ దుర్గాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారిని శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్ధప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, జిల్లా షీప్ సొసైటీ ఛైర్మన్ తోడేటి గోపి, టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బూరి రాజేష్, మాజీ అధ్యక్షుడు బి. వెంగయ్య, సింగిల్‌విండో చైర్మన్ సీహెచ్ వెంకట్‌రెడి, దేవస్థాన చైర్మన్ శ్యాంసుందర్‌రాజు తదితరులు ఉన్నారు.