Share News

విధ్వంస పాలన దాటి.. అభివృద్ధి వైపు అడుగులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:52 PM

గత ఐదేళ్ల విధ్వంసపాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు పడేలా చేస్తున్నారని అందులో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్‌ రెడ్డి అన్నారు.

విధ్వంస పాలన దాటి.. అభివృద్ధి వైపు అడుగులు
తిమ్మాపురంలో పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అందిన పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్న ఎరిక్షన్‌బాబు

చేసిన మేలు గుర్తించండి

వైసీపీ మాయలో మళ్లీ పడొద్దు

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, ఎరిక్షన్‌బాబు

గిద్దలూరు టౌన్‌/త్రిపురాంతకం/పెద్ద దోర్నాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : గత ఐదేళ్ల విధ్వంసపాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు పడేలా చేస్తున్నారని అందులో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్‌ రెడ్డి అన్నారు. చేసిన మంచిన గుర్తించి, వైసీపీ మాయలో పడవద్దని ప్రజలకు సూచించారు.

గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం అశోక్‌రెడ్డి ఇం టింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్ర భుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందచేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాదికాలంలో పింఛన్‌ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసిందన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేసింది లేదన్నారు. నియోజకవర్గంలో గ్రామాల వార్డులలో డ్రైన్లు, తాగునీటి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకమ్రంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, గ్రామసర్పంచ్‌ పసుపుల మల్లేశ్వరరావు, జడ్‌పిటిసి బుడత మధుసూదన్‌, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, పెద్దయ్య పాల్గొన్నారు.

త్రిపురాంతకం: మండలంలోని నడిగడ్డ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, పార్టీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మంచౌదరికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. గడచిన ఐదేళ్లు అభివృద్ధికి తావులేకుండా వైసీపీ పాకులు దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నదని అన్నారు. నడిగడ్డ రోడ్డు చూస్తేనే ఇక్కడ అభివృద్ధి ఎంతమేర జరిగిందో తెలుస్తుందని చెప్పారు. గడచిన ఐదేళ్లు ఇక్కడ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ జగన్‌ తరువాత తానే అన్నట్టు చెప్పుకోవడమే తప్ప గ్రా మాల్లో తట్టెడు మట్టిపోసిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో వేసిన సిమెంట్‌ రోడ్లు, గుంతలు పూడ్చడం, తారురోడ్ల నిర్మాణం చూసి ఏ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టిందో ప్రజలే నిర్ణయించాలని చెప్పా రు. త్వరలో కోటి రూపాయలకు పైగా నిధులతో నడిగడ్డ రోడ్డు పనులు ప్రారంభించడంతోపాటు నడిగడ్డ గురిజేపల్లి రోడ్డును కూడా నిర్మాణ పనులు చేపడతామని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ దోపిడీ సొముతో మళ్లీ ప్రజల్లోకి రావచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారని చెప్పారు. అనంతరం గ్రామం లో గృహాలను సందర్శించి వారికి జరిగిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో పార్టీ కన్వీనర్‌ మేకల వలరాజు, పార్టీ నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, చలమయ్య, ఏడుకొండలు, మోటకట్ల శ్రీనివాసరెడ్డి, వెంకటనారాయణ, కోటేశ్వరరావు, గ్రామ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. 8వ వార్డులో టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది కాలంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు మైనార్టి సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ మాబు, దొడ్డా శేసాద్రి, ఈదర మల్లయ్య, చంటి, షేక్‌ సమ్మద్‌ బాషా, దేసు నాగేంద్రబాబు, చల్లా వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు, కే సుబ్బారెడ్డి, షేక్‌ మంజూర్‌ బాషా, షేక్‌ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:52 PM