Share News

ఏఆర్‌టీ సెంటర్‌తో మెరుగైన సేవలు

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:46 AM

అద్దంకి సీహెచ్‌సీలో ఏఆర్‌టీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీ.అంకినీడు ప్రసాద్‌ అన్నారు.

ఏఆర్‌టీ సెంటర్‌తో మెరుగైన సేవలు

అద్దంకిటౌన్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, రోజు వారి వాడుకోనే మందులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అద్దంకి సీహెచ్‌సీలో ఏఆర్‌టీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీ.అంకినీడు ప్రసాద్‌ అన్నారు. సోమవారం అద్దంకిలోని సీహెచ్‌సీ వైద్యశాలలో ఏఆర్‌టీ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి గదులను, వసతులను ఆయన వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియో జకవర్గ పరిధిలోని వ్యాధిగస్తులందరికీ, వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురా వాలన్నారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఏఆర్‌టీ సెంటర్‌ను మంజూరు చేయించినట్లు తెలిపారు. వ్యాధిగస్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి మందులు తెచ్చుకోలేక మధ్యలోనే నిలిపి వేస్తున్నారన్నారు. దీని వలన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గి మరణాల పాలువుతున్నారన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవా లన్నారు. తద్వారా వారి ఆ రోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు సుఖ వ్యాధులు, ప్రాణాంత కమైన వ్యాధులు వంటివి తెలుసు కోవచ్చన్నారు. తద్వారా మందులు వినియో గించుకోవచ్చన్నారు. బాధితులు వివరాలు గోప్యంగా ఉంచాలని, వారి పట్ల వివక్ష చూపకూడదన్నారు. 2026 జనవరి 15లోపు సెంటర్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కే.వాహిలా చౌదరి, హెల్ప్‌ టిఐ పరాజక్‌ డైరెక్టర్‌ బివి సాగర్‌, నాగార్జున, జిల్లా దిశా క్లినికల్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ ఎం.చైతన్యకుమార్‌, ఎస్‌కే అమీన్‌, ఐసీటీసీ కౌన్సిలర్‌ రమేష్‌, ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:46 AM